యోగా

శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, ఉంటేనే జీవితం లో ఎటువంటి పనినైనా సాధించవచ్చు. శరీర ఆరోగ్యం అంటే లావుగా ఉండటం కాదు. ఎటువంటి జబ్బులకు గురికాకుండా, బిదితోను, శరీరం తోను అనుకున్న పనిని అలసట లేకుండా చేయగలగడం. ఈ రకంగా మనం ఉండగలగాలి అంటే మన ఋషులు, చాల మార్గాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది హఠయోగం. ఈ హఠయోగం లో షట్కర్మలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలైనవి చెప్పబడ్డాయి. ప్రత్యేకించి యోగాసనాలు వల్ల మన శరీరంలోని అవయవాలు అన్నీ బలం పుంజుకుంటాయి మరియి శక్తివంతంగా తయారవ్వడంతో మానసికం గా కూడా బుద్ధిబలాలు పెరుగుతాయి.

యోగ అంటే ఏంటి ?

‘యోగా’ అనే పదం సంస్కృత మూలం ‘యుజ్’ నుండి ఉద్భవించింది, దీని అర్థం ‘చేరడం’  లేదా ‘ఏకపరచడం’.