ధ్యానం

ధ్యానం అంటే మనం మన ఆంతర్యపు ప్రపంచం తో అనుసంధానం అవ్వడం. ధ్యానం లో చాల రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో బాగా ప్రాచుర్యం పొందినది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బౌద్ధ పద్ధతి.

ప్రాచీన పాళీ భాష లో దీనిని “ఆనాపాన సతి” అంటారు.
‘ఆన’ అంటే ‘ఉచ్చ్వాస’,
‘అపాన’ అంటే ‘నిశ్వాస’
‘సతి’ అంటే ‘కలసి ఉండటం’ లేదా స్వాస యొక్క ఉనికిని గమనించడం.
దీనినే శ్వాస ధ్యానం అంటారు.

ధ్యానం ఎలా చెయ్యాలి ?

ఒక నిశ్శబ్దమైన ప్రదేశం లో కూర్చుని కాళ్ళని కలిపి, వేళ్లలో వేళ్ళు పెట్టి, కళ్ళని మూసుకోవాలి. మనం మన కాళ్ళను చేతులను కాలినప్పుడు శక్తివలయం ఏర్పడుతుంది. అది మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది. కళ్ళు మనసుకి ద్వారాలు. కళ్ళద్వారా 80% శక్తీ విడుదల అవుతుంది కనుక మనం కళ్ళు మూసి ఉంచడం చాల ముఖ్యం. అదేవిధం గా చేతులనుంచి 10 % మరియు కాళ్ళ నుండి మరొక 10% శక్తీ విడుదల అవుతుంది. ఈ పద్ధతిని ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యవోచు. ధ్యానం చేసేటప్పుడు సౌకర్యవంతం గా కూర్చోవాలి. దీనినే ‘సుఖాసనం’ అంటారు. ధ్యానం చేసే సమయం లో కఠినమైన ఆసనం లో ఖుర్చోవలసిన అవసరం లేదు. శ్వాస తీసుకునేంత సుఖవంతంగా, సులువుగా ఉండాలి.

శ్వాసను గమనించడం ఎంత సులువైన విషయమో ఈ పద్ధతి కూడా అంతే సులువైన విషయం. ఈ పద్ధతిలో ఎటువంటి మంత్రములు ఆచరించాల్సిన అవసరం లేదు, అసహజమైన శ్వాస ఉండకూడదు ఎటువంటివాటిని ఊహించకూడదు. మనం చెయ్యవలసిందల్లా ఉచ్చ్వాస – నిశ్వాస లని గమనించడమే. ధ్యాన సమయం లో ఆలోచనలు రావడం సహజం. వాటితో పోరాడాల్సిన అవసరం లేదు. ఆలోచనలు వొస్తున్న విషయాన్నీ తెలుసుకొని మీరు చెయ్యాల్సింది ఒకటే. 

ఆలోచనలు వోస్తేరానీ , పోతే పోనీ, ఆలోచనల వెంబడి వేళ్ళకు, కొత్త ఆలోచనలు సృష్టించుకోకు.

ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు తగ్గుముఖం పెట్టడాన్ని మీరు గమనిస్తారు. ధ్యానం చేస్తూ ఉండగా ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు మధ్య సమయం పెరుగుతుంది, క్రమంగా ఆలోచనారహిత స్థితి కి దారితీస్తుంది.ధ్యానం ఆలోచనా విధానాన్ని సరిచేస్తుంది. మీకు సాకులు చెప్పుకునే ఆలోచన విధానం ఉన్నట్లయితే, అది ఎన్నటికీ సాధ్యం కాదు. ముందు మీ అంతరంగం లో స్పష్టత ఉండాలి మరియు ముందుకు సాగాలన్న ఆలోచన విధానం ఉండాలి, అప్పుడే అది సాధ్యపడుతుంది.

ఎంత సేపు ధ్యానం చెయ్యాలి ?

మీ వయసు ఎన్ని సంవత్సరాలో కనీసం ఒక్క రోజులో అన్ని నిముషాలు ధ్యానం చెయ్యడం మొదలు పెట్టండి. ఉదాహరణకు మీకు 30 సంవత్సరాల వయసు ఉంటె ఒకరోజులో మీరు కనీసం 30 నిముషాలు పాటు ధ్యానం చెయ్యాలి. అలాగే మీకు 40 సంవత్సరాల వయసు ఉంటె 40 నిముషాలు పాటు ధ్యానం చెయ్యాలి, మీకు 15 సంవత్సరాల వయసు ఉంటె 15 నిముషాలు పాటు ధ్యానం చేస్తే సరిపోతుంది. ఎంత వయసు వారైనా సరే ధ్యానం చెయ్యడం మొదలుపెట్టండి. వయస్సు, లేదా సమయం కోసం నిరీక్షించవలసిన అవసరం లేదు. ధ్యానం మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం.