Spread the love

బల్లి శాస్త్రము

బల్లి పడుటవలన కలుగు శుభాశుభములు

బల్లి కానీ, తొండ కానీ, శరీరం పై ఎక్కడ పడిననూ వెంటనే తల స్నానము చేసి నూనె, నెయ్యి, ఆముదం కలిపి దీపం పెట్టి ఉప్పు నైవేద్యం పెట్టి ఇష్టదైవమును ప్రార్ధించాలి. బల్లి తలపైనుంచి క్రిందకు దిగిన మంచిదికాదు. క్రింద నుండి పైకి వెంటనే దిగినచో మంచిది.

Woman

స్త్రీలకు

తల మీద – ప్రాణభయం
కొప్పు పై – రోగభయం
పిక్కలు – బంధుదర్శనం
ఎడమకన్ను – భర్తప్రేమ
కుడికన్ను – మనోవ్యధ
వక్షమున – సుఖము
కుడిచెంప – పుత్రలాభం
కుడి చెవి – ధనలాభం
పైపెదవి – విరోధములు
క్రింద పెదవి – వస్తులాభం
రెండుపెదవులు – కష్టం
స్తనములందు – అధిక దుఃఖం
వీపుయందు – మరణవార్త
గోళ్లపై – కలహం
కుడిభుజం – రతిసౌఖ్యం
బాహువులు – భూషణ ప్రాప్తి
ఎడమ భుజం – సుఖం
తొడలయందు – వ్యభిచారం
మోకాళ్ళ యందు – కష్టం
కుడికాలిపై – శత్రునాశనం
కాలివేళ్ళు – పుత్రలాభం

Man

పురుషులకు

తల మీద – కలహం
బ్రహ్మ రంద్రం – మృత్యువు
ముఖము – ధనలాభం
ఎడమ కన్ను – శుభం
కుడికన్ను – అపజయం
నుదురు – బంధువిరోదం
కుడిచెంప – దుఃఖం
ఎడమ చెవి – లాభం
పైపెదవి – కలహం
క్రిందపెదవి – ధనలాభం
రెండు పెదవులపై – మృత్యువు
నోటియందు – రోహప్రాప్తి
ఏడమ మూపు – జయం
వీళ్ళపై – స్నేహితుల రాక
కుడిభుజం – కష్టం
ఎడమభుజం – అగౌరవం
తొడలపై – వస్త్రనాశనం
కుడిపాదం – సుఖం
ఎడమపాదం – కష్టం
పాదాల వెనుక – ప్రయాణం
కాలివేళ్ళు – రోగపీడ